తెలంగాణలో పెట్టుబడుల జాతర.. ఉపాధికి కొదువ లేకుండ చర్యలు.. సీఎం రేవంత్ రెడ్డి
కిరణ్ టి.వి, హైదరాబాద్ :- పెట్టుబడులకు గమ్య స్థానంగా ఇప్పటికే తెలంగాణ దేశంలోని అందరి దృష్టిని ఆకర్షిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ విదేశాల్లో పేరొందిన కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణముందని సీఎం అభిప్రాయపడ్డారు. ఫ్యూచర్ సిటీగా వెలుగొందుతున్న హైదరాబాద్ సిటీలో ఉన్న సానుకూలతలను ప్రపంచ వేదికపై పరిచయం చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం అందరినీ ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం…