
మంత్రి సురేఖకు బిగ్ షాక్.. క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం
కిరణ్ టి.వి, హైదరాబాద్ :- మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21వ తేదీ లోపు నిందితురాలిపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. కేటీఆర్ ఫిర్యాదు.. ఆరోపణల వివరాలు…