తెలంగాణ-ఏపీ సీఎంలు.. అస్త్రాలు రెడీ.. దావోస్‌లో

కిరణ్ టీవీ, ఢిల్లీ :- తమ రాష్ట్రాలకు పెట్టుబడులు రప్పించడమే లక్ష్యంగా ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రులు దావోస్‌లో అడుగుపెట్టారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తోపాటు కీలక వ్యక్తులను తమతో తీసుకెళ్లారు. తమ రాష్ట్రానికి వస్తే ఎలాంటి సదుపాయాలు ఉంటాయనే దానిపై క్లియర్‌గా వివరించనున్నారు. గడిచిన పదేళ్లు దావోస్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి.

పెట్టుబడులు రప్పించేందుకు దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పోటీ పడుతున్నాయి. 130 దేశాల నుంచి 3 వేల మంది నాయకులు, 1600 మంది బిజినెస్‌మేన్లు, 100కు పైగా టెక్ దిగ్గజాలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే పెట్టుబడులు ఆకట్టుకునేందుకు రాష్ట్రాలకు ఇదే సరైన అవకాశం అన్నమాట.

సీఎం రేవంత్‌రెడ్డి టీమ్ పక్కా ప్లాన్‌తో దావోస్‌కి వెళ్లింది. తెలంగాణకు వచ్చేసరికి ఫోర్త్ సిటీకి పెట్టుబడులు రప్పించేందుకు కృషి చేస్తున్నారు. రెండుసార్లు విదేశీ పర్యటనలు తమకు అనుకూలిస్తుందన్నది ప్రభుత్వం ఆలోచన. ఫ్యూచర్ సిటీకి ఉన్న అడ్వాంటేజ్‌లను పారిశ్రామిక వేత్తలకు వివరించనుంది. దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ సిద్ధం చేసింది.

హైదరాబాద్‌లో గ్లోబల్ కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అలాగే ట్రాన్స్‌పోర్టు సదుపాయాలు, స్కిల్ యూనివర్సిటీ వంటి ప్రాముఖ్యతను వందలాది మంది పారిశ్రామిక వేత్తలకు వివరించనుంది. టీ హబ్, ఇతర ఐటీ కంపెనీలు రావడానికి కృషి చేసిన ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్‌ వెళ్లడం తెలంగాణకు అడ్వాంటేజ్. ఎందుకంటే గతంలో ఆయన చాలా‌సార్లు దావోస్ కు వెళ్లారు. అది కూడా కలిసి వస్తుందని భావిస్తోంది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ సదస్సుకు భారతదేశం నుండి అత్యధిక సార్లు హాజరైన నేతల్లో ఒకరు. 20వ దశకంలో దావోస్ వేదికగా అనేక పెట్టుబడులను ఆకర్షించారు. హైటెక్ సిటీ నిర్మించడం, ప్రపంచ దిగ్గజ సంస్థలను ఆహ్వానించారు. ఆయన సాధించిన గొప్ప విజయాలలో కీలకమైనవి.

ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రతీ ఏడాది దావోస్‌కు వెళ్తున్నారు. ఆయనకు అక్కడి వెళ్లిన నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉండే పలువురు పారిశ్రామిక వేత్తలతో మంచి సంబంధాలున్నాయి. గతంలో తమిళనాడు ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డులో వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు సరిన్ పరాపరకత్. ఆయన కాలంలో తమిళనాడుకు పెట్టుబడులు వెల్లువెత్తాయి.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సరిన్ పరాపరకత్ ఏరి కోరి ఏపీకి తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు. ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు వీసీగా ఆయనను నియమించారు. ఏపీకి విశాలమైన కోస్తా తీరం, కొత్త రాజధాని అమరావతి, ఐటీ హబ్‌కు కేరాఫ్‌గా విశాఖను పరిచయం చేయనున్నారు. మిట్టల్ స్టీల్‌ప్లాంట్, గ్రీన్ ఎనర్జీ యూనిట్ నెలకొల్పడం లాంటి అంశాలు ప్రస్తావించే అవకాశముంది. ఎటు చూసినా పెట్టుబడులను రప్పించేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య పోటీ నెలకొందనే చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

support

support

Typically replies within an hour

I will be back soon

support
Hello 👋 Thanks for your interest in us. Before we begin, may I know your name?
Start Chat with:
chat Need Help?
×